దసరా నవరాత్రుల సమయంలో ఇంట్లో కొన్ని వస్తువులు ఉండకూడదని పురోహితులు సూచిస్తున్నారు. విరిగిన దేవతా విగ్రహాలు, చిరిగిన ఫోటోలు, తుప్పు పట్టిన పాత్రలు, అనవసరమైన వస్తువులు ఇంట్లో ఉంచడం అశుభకరం. అమ్మవారి ఆశీస్సులు పొందడానికి, ఇంట్లో శాంతి, సంపద నిలవడానికి వాటి స్థానంలో కొత్త, శుభ్రమైన వస్తువులను ఉంచాలని, అనవసరమైన వాటిని తొలగించి సానుకూల శక్తికి స్థలాన్ని సృష్టించుకోవాలి. నవరాత్రులను ఈ మార్పులకు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.