దసరా ధమాకా.. ఫస్ట్ ప్రైజ్ నాటుకోడి, ఫుల్ బాటిల్

57033చూసినవారు
దసరా ధమాకా.. ఫస్ట్ ప్రైజ్ నాటుకోడి, ఫుల్ బాటిల్
TG: గ్రామాల్లో దసరా జోష్ ఊపందుకుంటుంది. కరీంనగర్ జిల్లా చెర్లభూత్కూర్‌లో దసరా పండుగ నేపథ్యంలో వింత ఆఫర్ల ఫ్లెక్సీలు వెలిశాయి. రూ.50 చెల్లించి కూపన్ తీసుకోండి.. దసరా ధమాకా గెలుచుకోండి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మొదటి బహుమతిగా నాటుకోడి, ఫుల్ బాటిల్, రెండు, మూడో బహుమతుల కింద పలు బ్రాండ్ల మద్యం గెలుచుకోండంటూ వాట్సాప్, ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేస్తున్నారు. చెర్లభూత్కూర్‌తోపాటు సమీప గ్రామాలకు చెందిన వ్యక్తులు కూపన్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది.