ఏపీలోని పాఠశాల విద్యార్థులకు ఈ ఏడాది దసరా సెలవులు ముందుగానే ప్రారంభం కానున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 12 నుంచి 21 వరకు ప్రకటించిన సెలవులకు ముందు రెండో శనివారం (అక్టోబర్ 10), ఆదివారం (అక్టోబర్ 11) రావడంతో విద్యార్థులకు అదనంగా మరో రెండు రోజులు కలిసి వచ్చాయి. దీంతో అక్టోబర్ 10 నుంచే సెలవులు మొదలై, మొత్తం 12 రోజుల పాటు విరామం లభించనుంది. అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. తెలంగాణలో విద్యార్థులకు అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు 13 రోజుల పాటు సెలవులు ప్రకటించారు, అక్టోబర్ 23న తరగతులు ప్రారంభమవుతాయి. విజయదశమి అక్టోబర్ 20న, బతుకమ్మ ఉత్సవాలు అక్టోబర్ 18న జరగనున్నాయి.