
14 ఏళ్ల తర్వాత తండ్రి హత్యకు ప్రతీకారం
ఉత్తరప్రదేశ్లోని షామ్లి జిల్లాలో 30 ఏళ్ల రాహుల్ తన తండ్రి బ్రిజ్పాల్ను 2011లో హత్య చేసిన 45 ఏళ్ల జైవీర్పై ప్రతీకారం తీర్చుకున్నాడు. గన్తో జైవీర్ను కాల్చి చంపి ఆ తర్వాత పారిపోయాడు. మృతుడు 11 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి విడుదలైన తర్వాత గత మూడు సంవత్సరాలుగా గ్రామంలోనే నివసిస్తున్నాడు. శనివారం పొలం నుంచి ఇంటికి వెళ్తుండగా హత్య చేశాడు. పోలీసులు నిందితుడి కోసం వెతుకుతున్నారు.




