చనిపోతూ.. ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపిన రమ్యశ్రీ

22897చూసినవారు
చనిపోతూ.. ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపిన రమ్యశ్రీ
హైదరాబాద్‌లో బ్రెయిన్‌డెడ్‌ అయిన ఓ గృహిణి.. అవయవ దానం ద్వారా ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. కాలేయం, కిడ్నీలు, ఊపిరితిత్తులు, కంటి కార్నియాలను దానం చేసి వారికి పునర్జన్మ ప్రసాదించారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారం గ్రామానికి చెందిన బండిగారి రమ్యశ్రీ(28) ఈ నెల 21న తన ఇంట్లో తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించినప్పటికీ.. రమ్యశ్రీ బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్