కేంద్ర ప్రభుత్వం నుంచి గ్యాస్ సబ్సిడీ పొందుతున్న వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు కీలక ప్రకటన చేశాయి. సబ్సిడీని కొనసాగించుకోవాలంటే ప్రతి ఏటా ఈ-కేవైసీ తప్పనిసరి అని స్పష్టం చేశాయి. ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయని వారికి 8వ, 9వ రీఫిల్‌లకు సబ్సిడీ నిలిపివేస్తారు. 2026 మార్చి 31 లోపు ఈ-కేవైసీ పూర్తి చేస్తే నిలిపివేసిన సబ్సిడీ డబ్బు తిరిగి చెల్లిస్తారు. ఈ ప్రక్రియ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఉచితంగా చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు http://www.pmuy.gov.in/e-kyc.html ను సంప్రదించవచ్చు.