ఉద్యోగులు తమ ఈపీఎఫ్ఓ ఖాతాలో ఈ-నామినేషన్ వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. ఉద్యోగి మరణించినప్పుడు, ఈ-నామినేషన్ లేకపోతే కుటుంబ సభ్యులు లేదా నామినీలు క్లెయిమ్ మొత్తం పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లో 'Manage' ఆప్షన్లోని 'e-Nomination' ద్వారా కుటుంబ సభ్యుల ఆధార్, సంబంధం, వాటా శాతాన్ని నమోదు చేసి, ఆధార్ ఓటీపీ (e-Sign) ద్వారా కేవలం 10 నిమిషాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.