E20 పెట్రోల్‌తో 2023కి ముందు తయారైన వాహనాలు దెబ్బతింటున్నాయని మొదటి నుంచి ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. E20తో పాటు E10 కూడా ఇవ్వాలని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. దాంతో కేంద్రం పునరాలోచనలో పడినట్లు సమాచారం. E20 పెట్రోల్‌పై కేంద్రం ఒకింత వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. E20తో పాటు E10 పెట్రోల్‌ను అందించేందుకు కేంద్రం సాధ్యాసాధ్యాలపై చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.