ప్రపంచకప్ విజయంలో పంజాబ్ క్రీడాకారుల కృషిని గుర్తిస్తూ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ బహుమతి ప్రకటించింది. జట్టులో ఉన్న ప్రతి పంజాబీ క్రీడాకారిణికి రూ.11 లక్షల చొప్పున నగదు రివార్డ్ అందజేయనున్నట్లు తెలిపింది. దీంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఆల్‌రౌండర్ అమన్‌జ్యోత్ కౌర్‌లకు ఈ నజరానా లభించనుంది. అంతేకాకుండా జట్టులో ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్న మునీష్ బాలి రూ.5 లక్షల బహుమతి అందుకోనున్నారు.