
నిద్రిస్తున్న భర్తపై కొడవలితో దాడి.. ప్రైవేట్ పార్ట్‌ని కోసేసిన భార్య
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్య ద్రౌపతి బాయి తన భర్త రాజేష్ కౌశిక్‌పై అమానుషంగా దాడి చేసింది. నిద్రిస్తున్న భర్తపై కొడవలితో దాడి చేసి, అతని ప్రైవేట్ పార్ట్‌ని కోసేసింది. తీవ్రంగా గాయపడిన రాజేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ గొడవలు, భర్త ప్రవర్తనపై అనుమానమే ఈ ఘాతుకానికి కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




