ఎర్త్ అవర్-2026 సందర్భంగా తెలంగాణ సచివాలయంలోని లైట్లు అన్నింటినీ ఒక గంట పాటు ఆఫ్ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ఎర్త్ అవర్ను పాటించారు. రాత్రి 8:30 నుంచి 9.30గంటల వరకు ప్రధాన భవనంతో పాటు అక్కడి కార్యాలయాలు గంట పాటు చీకటిలో ఉండి ఇంధన పొదుపు సందేశాన్నిచ్చాయి. #GiveAnHourForEarth నినాదంతో సాగిన ఈ ప్రపంచవ్యాప్త ఉద్యమంలో పాల్గొని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని GHMC పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.