ఆఫ్గానిస్థాన్‌లో భూకంపం.. 600కి పైగా చేరిన మృతుల సంఖ్య (వీడియో)

15859చూసినవారు
అఫ్గానిస్థాన్‌లోని కునార్ ప్రావిన్స్‌లో సోమవారం సంభవించిన భూకంపం భారీ ప్రాణనష్టానికి దారితీసింది. ఈ విపత్తులో ఇప్పటివరకు 622 మంది మృతిచెందారని ఆ దేశ అధికారిక మీడియా సంస్థ రేడియో టెలివిజన్ అఫ్గానిస్థాన్ ప్రకటించింది. అదనంగా మరో 1,500 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. కూలిన ఇళ్ల శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుపోయి ఉండొచ్చని స్థానిక అధికారులు తెలిపారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్