మయన్మార్‌లో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రతగా నమోదైన ఈ ప్రకంపనలు భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలకూ విస్తరించాయి. ముఖ్యంగా మణిపూర్, నాగాలాండ్, అస్సాంలో స్వల్పంగా భూమి కంపించిందని అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం.