ఓ పక్క భూకంపం.. మరో పక్క నర్సుల సాహసం. అస్సాంలో ఆదివారం సాయంత్రం ఉదల్గురి జిల్లాలో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో నాగావ్‌లోని ఆసుపత్రిలో బలమైన ప్రకంపనల మధ్య నర్సులు నవజాత శిశువుల ప్రాణాలను సురక్షితంగా కాపాడారు. శిశువులను ఊయలలో జాగ్రత్తగా పట్టుకుని ప్రమాదం నుంచి నర్సులు రక్షించారు. వారి చేసిన పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.