
ఢిల్లీలో భారీ పేలుడు.. 12 మందికి తీవ్రగాయాలు
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో పార్క్ చేసిన కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ ఎల్ఎన్జేపీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కాగా, రద్దీ ప్రాంతాల్లో వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అనుమానస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.




