
గుండెపోటుతో ఆరేళ్ల బాలిక మృతి
అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యాడికి మండలం చందన గ్రామంలో ఆరేళ్ల బాలిక నైనిక గుండెపోటుతో మృతి చెందింది. ఆడుకుంటుండగా బాలిక ఒక్కసారిగా కుప్పకూలింది. తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించినా, అప్పటికే బాలిక మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషాద సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.




