
రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం.. 20 మంది మృతి (వీడియో)
ఢిల్లీలోని మాల్వియా నగర్ ప్రాంతంలో ఉన్న ‘లెమన్ గ్రీన్ రెస్టారెంట్’ బేస్మెంట్లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 9:45 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందడంతో, వెంటనే స్పందించి పలు అగ్నిమాపక శకటాలను ఘటనా స్థలానికి పంపించారు. ఈ ప్రమాదంలో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మంటలు క్షణాల్లోనే భవనం అంతటా వ్యాపించాయి. లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.




