బీన్స్ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు తెలిపారు. వీటిలో యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్లు, కాపర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా బీన్స్‌లో ఉండే మెగ్నీషియం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందించి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.