
ఈజీగా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా!
గత కొన్నేళ్లుగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన చందాదారుల అవసరాలకు అనుగుణంగా కీలక మార్పులు చేపడుతోంది. ఒకప్పుడు పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం, విత్డ్రా చేయడం లేదా క్లయిమ్ దాఖలు చేయడం వంటివి క్లిష్టమైన ప్రక్రియలుగా ఉండేవి. అయితే, ప్రస్తుతం డిజిటలైజేషన్ వల్ల ఈపీఎఫ్ఓ సేవలు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 7 కోట్లకు పైగా చందాదారులు ఉన్నారు.




