రాత్రి భోజనాన్ని నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందు చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయని, పోషకాలు బాగా గ్రహించబడతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ప్రేగుల ఆరోగ్యానికి మద్దతునిచ్చి, యాసిడ్ రిఫ్లక్స్, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మధుమేహం వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. రాత్రి 7.30 లోపు భోజనం చేస్తే బరువు తగ్గడానికి, బరువును అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది.