నల్ల మచ్చలు లేదా బూజు పట్టిన ఉల్లిపాయలను తినడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణుల తెలిపారు. వీటిలో మైకోటాక్సిన్ అనే విష పదార్థం ఉంటుంది. ఇలాంటి ఉల్లిపాయలు తినడం వల్ల ఆహార అలెర్జీలు, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలతో పాటు క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, బూజు పట్టిన ఉల్లిపాయలను శుభ్రం చేసి వాడటం కంటే పడేయడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.