ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన రంజీత్ సింగ్, సైన్యంలో హవల్దార్‌గా పనిచేసి 2005లో పదవీ విరమణ చేశారు. మరుసటి ఏడాది, 2006 నుంచి ఆయన కేవలం పండ్లు మాత్రమే తింటున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో ఉంటున్న ఆయన, రెండు దశాబ్దాలుగా అన్నం, గోధుమలు వంటి ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను ముట్టుకోవడం లేదు. ఆలయ సందర్శనలో సాధువుల జీవనశైలి చూసి, క్రమశిక్షణతో పండ్లు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు రావని తెలుసుకున్నట్లు సింగ్ తెలిపారు.