
ఎర్రకోట ఆత్మాహుతి దాడి.. కీలక నిందితుడు అరెస్ట్
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పురోగతి సాధించింది. ఈ ఉగ్రవాద దాడిలో ఆత్మాహుతి బాంబర్ ఉమర్ నబీతో కలిసి కుట్ర పన్నిన కశ్మీరీ నివాసి అమీర్ రషీద్ అలీని ఎన్ఐఏ అరెస్టు చేసింది. కారును కొనుగోలు చేసి, అందులో IED అమర్చేందుకే ఇతను ఢిల్లీకి వచ్చినట్లు పేర్కొంది. ఈ నెల 10న జరిగిన ఆత్మాహుతి దాడిలో 10 మంది మరణించగా, 32 మంది గాయపడిన విషయం తెలిసిందే.




