ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Sep 26, 2026, 09:09 IST/

బాలాపూర్‌ రికార్డు బద్దలు.. దిల్‌సుఖ్‌నగర్‌ గణేశుడి లడ్డూకు రూ.51 లక్షలు!

Sep 26, 2026, 09:09 IST
TG: భాగ్యనగరంలో గణేశ్‌ నిమజ్జనోత్సవాల సందర్భంగా దిల్‌సుఖ్‌నగర్‌లోని జై గణేశ్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశుడి ప్రధాన లడ్డూ వేలంలో రూ. 51 లక్షలు పలికి బాలాపూర్ లడ్డూ రికార్డును అధిగమించింది. స్థానిక భక్తుడు రాజేష్ రూ. 51 లక్షలకు ప్రధాన లడ్డూను దక్కించుకున్నారు. మరొక లడ్డూను రూ. 25 లక్షలకు వేరొక భక్తుడు సొంతం చేసుకున్నారు. ఈ లడ్డూ ప్రసాదం వల్ల శుభం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. వేలం ద్వారా వచ్చిన నిధులను సామాజిక, సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు.