ఉలవలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు తెలిపారు. వీటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.