కాంగోలో ఎబోలా కలవరం.. సరిహద్దు మూసేసిన ఉగాండా

62చూసినవారు
కాంగోలో ఎబోలా కలవరం.. సరిహద్దు మూసేసిన ఉగాండా
కాంగోలో అరుదైన ఎబోలా కేసులు పెరుగుతుండటంతో, పొరుగునే ఉన్న ఉగాండా కీలక నిర్ణయం తీసుకుంది. కాంగోతో ఉన్న సరిహద్దును తక్షణమే మూసివేయాలని అధికారులను ఆదేశించింది. కాంగో ప్రజలు సరిహద్దు దాటి రావడం, స్థానిక ఆరోగ్య సిబ్బందికి వైరస్ సోకడం వంటి కారణాలతో ఉపాధ్యక్షురాలు జెస్కా అలుపో నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ ఈ నిర్ణయం తీసుకుంది. తూర్పు కాంగోలో వెయ్యికి చేరువలో ఎబోలా అనుమానిత కేసులు, 220 మంది మృతి చెందినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్