
కల్తీ నెయ్యి కేసు.. వైవీ సుబ్బారెడ్డి పీఏకి భారీగా అక్రమాస్తులు
AP: టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ, తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడు కదురు చిన్నప్పన్న వైసీపీ హయాంలో భారీ ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. ఢిల్లీలోని ఏపీ భవన్లో స్పెషల్ లైజన్ అధికారి హోదాలో నెలకు రూ.75 వేల వేతనంతో పనిచేసిన చిన్నప్పన్న విశాఖ, తాడేపల్లిలో కోట్లు విలువ చేసే ఆస్తులు కొన్నట్లు తేల్చింది. ఇవే కాకుండా షేర్ మార్కెట్లోనూ లక్షల్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించింది.




