కాంగోలో ఎబోలా వైరస్ కలకలం.. 2000 మందికి పైగా మృతి

44చూసినవారు
కాంగోలో ఎబోలా వైరస్ కలకలం.. 2000 మందికి పైగా మృతి
కాంగోలో ఎబోలా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ భారీన పడి ఇప్పటివరకు 2,000 మందికి పైగా మరణించారు. మంగళవారం నాటికి వెల్లడైన గణాంకాల ప్రకారం.. ఈ వైరస్ వ్యాప్తితో మొత్తం 4,381 నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,011 మరణాలు ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం 704 మంది రోగులు ఆసుపత్రిలో చేరి, ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. జంతువులు, గబ్బిలాల (బుష్మీట్) ద్వారా మనుషులకు వ్యాపించే ఈ వైరస్ నివారణకు ప్రస్తుతం టీకాగాని, చికిత్సగాని లేదు.

సంబంధిత పోస్ట్