ఇకపై ఈవీఎంలపై అభ్యర్థి కలర్ ఫొటో: ఈసీ

34740చూసినవారు
ఇకపై ఈవీఎంలపై అభ్యర్థి కలర్ ఫొటో: ఈసీ
ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫొటోలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ నిబంధనలు బీహార్ ఎన్నికల నుంచి అమలు కానున్నట్లు పేర్కొంది. దీంతో అభ్యర్థుల పేర్లు, అలాగే NOTA ఆప్షన్ ఒకే రకంగా, ఒకే సైజులో ముద్రిస్తారు. ఈ ఫాంట్ పరిమాణం కూడా పెద్దగా ఉంటుంది. దీనివల్ల వృద్ధులు లేదా దృష్టి లోపం ఉన్నవారు కూడా సులభంగా చదువుకోగలుగుతారు.