
బాపూఘాట్లో గాంధీ జయంతి.. గవర్నర్, సీఎం రేవంత్ నివాళి
హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం జరిగింది. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, అధికారులు గాంధీజీకి నివాళులర్పించారు. గాంధీజీ స్మారక స్థలాన్ని పుష్పాలతో అలంకరించి, ఆయన సేవలను స్మరించుకున్నారు. అహింస, సత్యాగ్రహం, శాంతి మార్గంలో గాంధీజీ చూపిన బాటను నేతలు గుర్తు చేసుకున్నారు.




