భర్త ఆర్థికంగా ఆధిపత్యం చెలాయిస్తున్నాడనే కారణంతో దాన్ని వైవాహిక క్రూరత్వంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి క్రిమినల్ కేసులను ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్ ల ధర్మాసనం పేర్కొంది. భర్త నుంచి దూరంగా ఉంటున్న మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కేవలం మాజీ భర్త ఆర్థిక ఆధిపత్య ధోరణి చూపడాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని, ఇలాంటి వైవాహిక వివాదాల కేసుల్లో కోర్టులు జాగరూకంగా వ్యవహరించాలని ధర్మాసనం అభిప్రాయపడింది.