అంబేద్కర్ ఆశయ సాధనకు విద్యే ఆయుధం: మంత్రి దామోదర

4870చూసినవారు
అంబేద్కర్ ఆశయ సాధనకు విద్యే ఆయుధం: మంత్రి దామోదర
TG: అంబేద్కర్ ఆశయ సాధనకు విద్యే ఆయుధమని, ఆయన భారత రాజ్యాంగాన్ని రూపొందించి ప్రతీ పౌరుడికి సమాన హక్కులు కల్పించిన మహనీయులని మంత్రి దామోదర రాజనర్సింహా కొనియాడారు. ఆదివారం శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే సునీతాలక్మారెడ్డితో కలిసి ఆవిష్కరించిన మంత్రి, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంతో పాటు HYDలో అత్యంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్