కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలతో రోజువారీ వినియోగ వస్తువుల ధరలు తగ్గుతున్నాయి. ఈ మేరకు ఎఫ్ఎంసీజీ కంపెనీలు గురువారం కొత్త ధరల వివరాలను ప్రకటించాయి. వాటిలో ముఖ్యంగా షాంపూలు, ప్యాంపర్స్, జిల్లెట్ ఉత్పత్తుల ధరలను, ఇమామి బోరోప్లస్ క్రీమ్, నవరత్న ఆయిల్, డెర్మీకూల్, జండు బామ్, సబ్బులు, టూత్‌పేస్ట్ ధరలను తగ్గించాయి. హార్లిక్స్, బూస్ట్, కిస్సాన్, బ్రూ కాఫీ ఉత్పత్తులపై కూడా ధరల తగ్గనున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.