అమెరికా ఆంక్షల ఎఫెక్ట్‌.. భారత్‌కు భారీ డిస్కౌంట్‌తో రష్యన్‌ ఆయిల్‌!

8411చూసినవారు
అమెరికా ఆంక్షల ఎఫెక్ట్‌.. భారత్‌కు భారీ డిస్కౌంట్‌తో రష్యన్‌ ఆయిల్‌!
రష్యా చమురు వ్యాపారంలో అమెరికా ఆంక్షలు కొత్త మార్పులకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా రాస్‌నెఫ్ట్, లుకోయిల్ వంటి అగ్రశ్రేణి సంస్థలపై ఆంక్షలు అమల్లోకి రావడంతో క్రూడాయిల్ ధరలు గణనీయంగా తగ్గాయి. దీంతో భారత్‌కు చమురు సరఫరా విధానం మారి, మన రిఫైనరీలకు భారీ లాభాలు చేకూరే అవకాశం ఉంది. ప్రస్తుతం రష్యా నుంచి భారత్‌కు సరఫరా అయ్యే ముడిచమురు ధరలు గత రెండేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువకు చేరాయి. ఉరల్స్ చమురును బ్రెంట్ ముడిచమురు ధర కంటే బ్యారెల్‌కు ఏడు డాలర్ల వరకు తగ్గింపుతో భారత రిఫైనరీలకు అందించడానికి సిద్ధమయ్యారు.

సంబంధిత పోస్ట్