తెలంగాణలో మళ్లీ వినోదపు పన్ను అమలు చేసేందుకు కసరత్తు!

0చూసినవారు
తెలంగాణలో మళ్లీ వినోదపు పన్ను అమలు చేసేందుకు కసరత్తు!
TG: రాష్ట్రంలో మళ్లీ వినోదపు పన్ను అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం రద్దు చేసిన వినోదపు పన్నును తిరిగి అమలు చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీ ద్వారా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. అయితే కేవలం థియేటర్లకు మాత్రమే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న వినోద రంగాలపై కూడా ఈ పన్ను అమలు చేసేందుకు విధి విధానాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావ్సాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్