పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద బాప్స్ బృందం పర్యటనపై తలెత్తిన వివాదంలో ఆ సంస్థకు క్లీన్చిట్ లభించింది. మహిళా సిబ్బందిని తొలగించాలని బాప్స్ ఎలాంటి అభ్యర్థన చేయలేదని దర్యాప్తులో తేలింది. తమ వద్ద ఉన్న మతపరమైన విగ్రహాలను మహిళలు తాకకుండా చూడాలని మాత్రమే కోరినట్లు అధికారులు తెలిపారు. అయితే అధికారుల మధ్య సమన్వయ లోపంతో మహిళా ఉద్యోగులను కొద్దిసేపు అక్కడి నుంచి పంపించారని వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో ఈఫిల్ టవర్ నిర్వహణ సంస్థ డైరెక్టర్ జనరల్ పదవి నుంచి తొలగించబడ్డారు.