ఎల్‌నినో ఎఫెక్ట్: హైదరాబాద్‌లో ముందుగానే స్కూళ్లకు దీపావళి సెలవులు

1చూసినవారు
ఎల్‌నినో ఎఫెక్ట్: హైదరాబాద్‌లో ముందుగానే స్కూళ్లకు దీపావళి సెలవులు
TG: ఎల్‌నినో ప్రభావంతో హైదరాబాద్ నగరంలోని పలు విద్యాసంస్థల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. దీనివల్ల ప్రైవేట్ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉన్న హాస్టళ్లలో నీటి కొరత తలెత్తడంతో, యాజమాన్యాలు విద్యార్థులకు ముందుగానే దీపావళి సెలవులను ప్రకటించాయి. కొన్ని కాలేజీలు సోమవారం నుంచే సెలవులు ఇవ్వగా, మరికొన్ని విద్యాసంస్థలు ఆన్‌లైన్ తరగతులను నిర్వహించాలని నిర్ణయించాయి. విద్యాసంస్థలు తిరిగి తెరిచే తేదీపై త్వరలోనే తల్లిదండ్రులకు సమాచారం అందిస్తామని యాజమాన్యాలు స్పష్టం చేశాయి.

సంబంధిత పోస్ట్