ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


పైలట్ స్మిత్ మచ్చర్‌కు అశోక చక్ర అవార్డు?
Oct 02, 2026, 08:10 IST/

పైలట్ స్మిత్ మచ్చర్‌కు అశోక చక్ర అవార్డు?

Oct 02, 2026, 08:10 IST
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న విమానాన్ని కోపైలట్ కూల్చేందుకు ప్రయత్నించగా, ఆ కుట్రను భగ్నం చేసిన ఫ్లైదుబాయ్ పైలట్ స్మిత్ మచ్చర్‌ను అశోక చక్ర అవార్డుతో సత్కరించే ఆలోచనలో భారత ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 180 మంది ప్రాణాలను కాపాడిన మచ్చర్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాతీ మూలాలున్న మచ్చర్‌కు ఇప్పటికే గుజరాతీ సర్కారు విశిష్ట్ గుజరాత్ గిరిమా అవార్డును ప్రకటించింది. అత్యంత ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించే వారిని అశోక చ‌క్ర అవార్డుతో స‌న్మానించే విష‌యం తెలిసిందే.