
ఆస్తి కోసం పక్షవాతంతో మంచానికే పరిమితమైన తల్లిపై దాడి (వీడియో)
TG: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలో ఆస్తి వివాదం నేపథ్యంలో కుటుంబ సభ్యులే పక్షవాతంతో బాధపడుతున్న తల్లితో పాటు ఆమె కుమారుడిపై భౌతిక దాడులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్లుగా అన్న, వదిన, ఆమె సోదరుడు వేధింపులకు పాల్పడుతున్నారని, మంచానికే పరిమితమైన తల్లిపై దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయని బాధితుడు నాగార్జున ఆరోపించారు. దాడుల్లో తీవ్ర గాయాలైన ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.




