
డ్యాన్స్ చేసిన సుధామూర్తి.. వీడియో వైరల్
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి ఓ పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా మేనల్లుడు ఎరిక్ మజుందార్ పెళ్లి రిసెప్షన్ సందర్భంగా బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్లో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. డప్పు చప్పుళ్ల నడుమ సుధా మూర్తి, కిరణ్ మజుందార్ షా ఉత్సాహంగా స్టెప్పులేశారు. వీరి ఎనర్జీని నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.




