హైదరాబాద్లో 90 ఏళ్ల వృద్ధుడిని డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి, నకిలీ సీబీఐ అధికారులమని నమ్మించి సైబర్ మోసగాళ్లు రూ.18 లక్షలు దోచుకున్నారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామని బెదిరించి, డబ్బు డిమాండ్ చేశారు. బాధితుడు మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి కాల్స్ వస్తే పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు.