బతికుండగానే సమాధి నిర్మించుకున్న వృద్ధుడు మృతి

28చూసినవారు
బతికుండగానే సమాధి నిర్మించుకున్న వృద్ధుడు మృతి
TG: బతికుండగానే సమాధి నిర్మించుకుని వార్తల్లో నిలిచిన వృద్ధుడు మృతి చెందాడు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన నక్క ఇంద్రయ్య (80) జీవించి ఉండగానే తన సమాధిని తానే నిర్మించుకున్నాడనే విషయం అప్పట్లో వైరల్‌గా మారింది. కాగా కొంతకాలం క్రితం అనారోగ్యానికి గురైన ఇంద్రయ్య శనివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు సైతం ఆయన నిర్మించుకున్న సమాధి వద్దనే ఆయన అంత్యక్రియల నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

సంబంధిత పోస్ట్