TG: చేతబడి చేస్తుందనే అనుమానంతో ఓ వృద్ధ మహిళపై గ్రామస్తులు చిత్రహింసలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్కే సకీనా బీపై గ్రామస్తులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో SMలో వైరల్ అవుతోంది. తాళ్లతో కొట్టి, చెట్టుకు మేకులు కొట్టి పైకి ఎక్కించారు. ఘటనపై పోలీసులు విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తేవాలని, బాధితురాలికి రక్షణ కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.