బీహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ సంచలనంగా మారింది. అక్రమ ఓటర్లను గుర్తించి 65 లక్షల పేర్లు తొలగించగా, కాంగ్రెస్, ఆర్జేడీ వంటి ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించి ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు చేశాయి. బీజేపీ-ఈసీ కలిసి ఓట్ల చోరీ చేస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా SIR అమలు చేయడానికి సెప్టెంబర్ 10న ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో ఈసీ సమావేశం ఏర్పాటు చేయనుంది.