తెలంగాణ గ్రామపంచాయతీ తొలివిడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగియడంతో ఫలితాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో భాగంగా రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు, మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 279 మంది అభ్యర్థులు గెలుపొందగా, బీఆర్ఎస్ నుంచి 45, బీజేపీ నుంచి 5, ఇతరులు 61 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫలితాలు మరికొద్దిసేపట్లో వెల్లడి కానున్నాయి.