అలంద్ నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపునకు ప్రయత్నించారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ ఎన్నికల సంఘానికి తెలుసని, దానిపై 2023లోనే ఎఫ్ఎఆర్ నమోదైందని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి (CEO) తెలిపారు. అప్పట్లో దాఖలైన 6,018 తొలగింపు దరఖాస్తుల్లో 24 మాత్రమే నిజమైనవిగా తేలిందని చెప్పారు. అందుబాటులో ఉన్న మొత్తం సమాచారాన్ని పోలీసులకు అందించామని CEO తెలిపారు.