బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. గురువారం ఆయన రాజన్న సిరిసిల్ల పర్యటనలో భాగంగా పట్టణంలోని మానేరు వంతెన చెక్ పోస్టు వద్ద కేటీఆర్ వాహనాలను మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలకు కట్టుబడి ఉంటామని, అధికారులకు సహకరిస్తామని కేటీఆర్ తెలిపారు.