ఛార్జింగ్‌ పెట్టిన 10 నిమిషాల్లోనే పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ

16940చూసినవారు
TG: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఛార్జింగ్‌ పెట్టిన 10 నిమిషాలకే ఎలక్ట్రిక్ స్కూటీ పేలింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో స్కూటీకి మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. వాహనదారుడు వెంటనే నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలేస్కో కంపెనీకి చెందిన స్కూటీగా గుర్తించినట్లు తెలుస్తోంది. పేలుడుకు కారణాలు, సాంకేతిక లోపాలపై అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ ఘటనతో స్థానికులు  భయాందోళనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్