
సెప్టెంబర్ నెల జీఎస్టీ వసూళ్లలో 14.7 శాతం వృద్ధి
సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు 14.7 శాతం పెరిగి రూ.2,03,521 కోట్లకు చేరాయి. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. వరుసగా మూడో నెలలోనూ వసూళ్లు రూ.2 లక్షల కోట్లు దాటడం గమనార్హం. కేంద్ర జీఎస్టీ ద్వారా రూ.37,762 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ ద్వారా రూ.45,363 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ ద్వారా రూ.1,20,396 కోట్లు వసూలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో మొత్తం వసూళ్లు రూ.12,46,278 కోట్లకు చేరాయి.




