ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Nov 04, 2026, 04:11 IST/

తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు.. రికార్డు వర్షపాతం నమోదు

Nov 04, 2026, 04:11 IST
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం బుధవారం నాడు ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే వరంగల్, నల్గొండ, సూర్యాపేటలో మోస్తరు వర్షాలు కురవవచ్చు. మరోవైపు ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో రాబోయే 24 గంటలు భారీ వర్షాలు, కృష్ణా, పల్నాడు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.